నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం అని చెప్పవచ్చు.. నందమూరి వారసుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు . ఇక ఆరు పదుల వయసులో కూడా అఖండ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇకపోతే తాజాగా బాలయ్య కు సంబంధించిన ఆస్తుల విషయాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అవేంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
బాలయ్య బాబు.. వసుంధరా దేవిని వివాహం చేసుకున్నప్పుడు 10 లక్షల రూపాయలు కట్నంగా వచ్చింది. ఇక ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్లో 30 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఉంది. ఒక కోటి రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు .. పలుచోట్ల కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూమి కూడా ఉంది. ఇక ఆయన దగ్గర నాలుగు కేజీల బంగారం, 5 కిలోల వెండి.. ఆయన భార్య దగ్గర 3,487 గ్రాముల బంగారం.. 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి.. తన కొడుకు దగ్గర 220 గ్రాముల బంగారం ,17 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఆయన ఆస్తి విలువ రూ. 325.47 కోట్ల వరకు ఉంటుందని, ఇక తన భార్య , పిల్లల పేర్ల పైనా మిగతా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.