హీరో బాలకృష్ణ ఇటు సినిమాలలోను, అటు బుల్లితెరపై బాగా రాణిస్తున్నాడు. తాజాగా ఆహా ఓటిటి వేదికలో వస్తున్న”UNSTOPPABLE”అనే టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు మోహన్ బాబు ఫ్యామిలీ, హీరో నాని, గెస్టుగా హాజరయ్యారు. వారిని తనదైన శైలిలో బాలయ్య ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్వించాడు.
అయితే తాజాగా ఈ షో కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అదేమిటంటే మీ షో కి గెస్ట్ గా నటి, ఎమ్మెల్యే రోజా రానున్నట్లు గా సమాచారం. త్వరలో దీనిపై ఆహా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రోజా పుట్టిన రోజున బాలయ్య ఆమెకు కాల్ చేసి విష్ చేసి, షో కు రావాలని ఆహ్వానించినట్లు గా తెలుస్తోంది. పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే.. నటి నటులుగా వీరి మధ్య మంచి రిలేషన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే రోజా ఈ షో లో పాల్గొంటుందా లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.