నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో నిన్నటి రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అల్లుఅర్జున్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి, తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నదని తెలియజేశారు.
తన తాతగారైన అల్లురామలింగయ్య కు, ఎన్టీఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉండేది అని తెలియజేశారు. తన తండ్రి అల్లు అరవింద్, బాలకృష్ణ ఓకే తరం వ్యక్తులని తెలియజేశారు. చిరంజీవి బాలకృష్ణ వంటి వారి సినిమాలు చూస్తూ పెరిగానని.. అలాంటిది ఈ రోజు నేను బాలయ్య గారి ఫంక్షన్కి రావడం చాలా స్వీట్ మెమోరీస్ తెలియజేశారు.
బోయపాటి గురించి చెప్పాలంటే నన్ను ఆయన ఎంతో గౌరవిస్తారని, నా కెరీర్లో సాలిడ్ హిట్ ఇచ్చిన వ్యక్తి అని చెప్పారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లెజెండ్, సింహం వంటి సినిమాలు చూశానని తాజాగా అఖండ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని తెలియజేశారు అల్లు అర్జున్. ఇక శ్రీకాంత్ తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఆయన విలన్ నిజంగా చేస్తున్నాడంటే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు.
బాలకృష్ణ గురించి చెబుతూ ఆయన ఈ స్థానంలో ఉన్నారంటే సినిమా అంటే ఆయనకున్న డెడికేషన్, అడిక్షన్ అని అన్నారు. బాలయ్య గారు డైలాగ్ చెప్పినట్లుగా ఏ హీరో చెప్పలేరని తెలియజేశాడు. రెండు మూడు పేజీలు ఉన్నప్పటికీ కూడా ఒకే తీవ్రతతో డైలాగులు చెప్పడం అందరికీ సాధ్యం కాదని కేవలం బాలకృష్ణకు ఒక్కటే సాధ్యం అని చెప్పుకొచ్చారు.