నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఓటిటి వేదికగా ఆహ లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్టు గా వ్యవహరిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా బాలయ్య తన మ్యాజిక్ ను చూపించారని చెప్పవచ్చు. బాలకృష్ణ ఏంటి హోస్టింగ్ ఏంటి అని ఆయన గురించి మాట్లాడుతున్న వారంతా.. కిషోర్ లో ఆయన నటన చూసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు బాలయ్య.
చాలా కూల్ గా ఎటువంటి తడబాటు లేకుండా బాలకృష్ణ ఫాస్ట్ గా చేస్తున్న విధానం అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంది. ఈ షో వల్ల ఆయనకున్న క్రేజ్ కూడా పెరిగింది. ఆర్థిక రూపంలో మాత్రమే కాకుండా ఇమేజ్ పరంగా కూడా బాలయ్యకి ఎంతో లాభం చేకూర్చిందని చెప్పవచ్చు. ఇదిలావుంటే బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్నా అందువల్లే ఈ షోకు.. ఆహా కు ఎక్కువమంది సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారనే వార్త బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ వయసులో కూడా బాలయ్య తన మార్క్ చాటుకోవడం గమనార్హం.