నేను కూడా అమ్మాయిలకు లైన్ వేసేవాడిని: బాలయ్య

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బికే.ఈ షోకి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చారు. ఈ షోకి తాజాగా సెలబ్రిటీ మాస్ మహారాజ్ రవితేజ వచ్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. రవితేజ తేజ్ పైకి ఎంట్రీ ఇవ్వగానే బాలయ్య నీకూ నాకూ పెద్ద గొడవైందటగా అని ప్రశ్నించగా..పనీపాటా లేని డ్యాష్ డ్యాష్ గాళ్ళు అలాంటి వార్తలు ప్రచారం చేస్తూ ఉంటారు అని తెలిపాడు.

మొగల్రాజపురం లో అమ్మాయిల చుట్టూ తిరుగుతూ లైన్‌ వేస్తుండేవాడివటగా, అని బాలయ్య అడగగా సమాధానం చెప్పలేక తెగ ఇబ్బందిపడ్డాడు..వెంటనే దీంతో బాలయ్య ఓపెన్‌ అవుతూ తప్పేంటయ్యా అంటూ మేము కూడా ఒకప్పుడు లైన్‌ వేసిన వాళ్ళమే అంటూ చెప్పుకొచ్చాడు.

రెడ్డి కాలేజీ దగ్గర మా బంధువులు ఉండేవారు.వాళ్ల పేరు చెప్పు కాలేజీ దగ్గరకు బైకులు వేసుకొని పోయి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ లైన్ వేసే వాళ్ళని చెప్పుకొచ్చాడు బాలయ్య.ఈ ఎపిసోడ్‌లో కి గెస్ట్లుగా రవితేజతో పాటు గోపీచంద్‌ మలినేని​ కూడా ఉన్నాడు. ఇక ఈ పూర్తి ఎపిసోడ్ చూసేందుకు డిసెంబర్‌ 31 వరకు ఆగాల్సిందే.

Share.