యువరత్న నందమూరి బాలకృష్ణ రూలర్ పేరుతో మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్టిల్స్ వచ్చేశాయి. తాజాగా దీపావళి కానుకగా రిలీజ్ అయిన రిలీజ్ డేట్ పోస్టర్ లుక్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. బాలయ్య ఏంటి.. ఇంత నీరసంగా ఉండడం ఏంటన్న కామెంట్లు ఫ్యాన్స్ నుంచే వినిపిస్తున్నాయి.
ఈ యాక్షన్ డ్రామాలో నటించినందుకు బాలయ్య భారీగా బరువు తగ్గాడు. సోనాల్ చౌహాన్, వేదిక బాలయ్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించినందుకు బాలయ్య తన రెమ్యునరేషన్ డబుల్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా రు.7 కోట్లు కోట్ చేసినా… చివర్లో సినిమాకు వచ్చిన హైప్‌తో పాటు ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరిగిన నేపథ్యంలో రు. 14 కోట్లు ఇచ్చేందుకు నిర్మాత సి కళ్యాణ్ అంగీకరించారట.
ఓవరాల్‌గా ఈ సినిమాకు రు.50 కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక బాలయ్య – కేఎస్.రవికుమార్ కాంబోలో వచ్చిన జై సింహా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అదే రోజు సాయిధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే కూడా రిలీజ్ కానుంది.