నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉండడమే కాకుండా తన కుమారుడు మోక్షజ్ఞని కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా ఒక వైపు రాజకీయాలలో మరొకవైపు బుల్లితెర షోలలో కనిపిస్తూ ఉన్నారు బాలయ్య. అయితే బాలయ్య భార్య వసుంధర మాత్రం ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదాలలో తల దూర్చదు. ఎక్కువగా ఈమె మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడరు అని చెప్పవచ్చు. కానీ బాలయ్య కోసం పలు సందర్భాలలో రాజకీయ ప్రచారం చేసిన వసుంధర ఆయన విజయానికి కారణమైందని వార్తలు మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి.
అయితే బాలయ్య భార్య హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని ఇండస్ట్రీ వర్గాల నుండి బాలయ్య సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోంది.ఆమె చేత నుంచి డబ్బులు తీసుకున్నారంటే ఆ తీసుకున్న వ్యక్తికి బాగా కలిసి వస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉన్నది. వసుంధర మంచి మనసు కలదు.ఎంతో మందికి సహాయాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా కష్టాలలో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటుందట వసుంధర. ముఖ్యంగా బాలయ్య బయటకు వెళ్లాల్సి ఉంటే తన భార్యతో కచ్చితంగా ఎదురు కావాల్సిందనే సెంటిమెంట్ కూడా బాలయ్య ఫాలో అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక బాలయ్యతో నిర్మించే చిత్రాల నిర్మాతలు కొందరు ఆమె చేతు నుంచి కొంత డబ్బును తీసుకొని మరి సినిమాలను నిర్మిస్తూ ఉంటారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా కేవలం ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలోనే గ్రాండ్గా చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం పైన మంచి హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత బాలయ్య, చిరు ఇద్దరు కలిసి సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావడం వల్ల నిర్మాతలకు కోట్లల్లో నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.