అఖండ సినిమాలో గిత్తల ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే.ఈ చిత్రం విడుదలై రెండు రోజులు అయినా కూడా థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉపయోగించినా రెండు గిత్తలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో ఉపయోగించిన రెండు గిత్తలు ఏ ప్రాంతాన్నికి చెందినవి? ఎవరివి ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అఖండ సినిమాలో కనిపించిన బసవన్నలు చౌటుప్ప ల్‌ మండలం చౌటుప్పల్ గ్రామానికి చెందినవి.గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు కూడా పెట్టాడు.

నిత్యం వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా తయారు చేశాడు. అలా ఒకసారి శ్రీనివాస్ రామోజీ ఫిలింసిటీ కి వెళ్ళినప్పుడు అక్కడ తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించారు. ఇక ఆ కోడెలు సినిమా టీమ్ నచ్చడంతో వాటిని పెట్టుకుని సినిమా తీశారు. ఇందులో ఆ గిత్తలు అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సినిమాకే వన్నె తెచ్చాయి.

Share.