బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా అఖండ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు వసూలవుతున్నాయి. అయితే ఆహా ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ ‘UNSTOPPBLE’ షో రికార్డు వ్యూస్ పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ షోలో అఖండ చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేసింది. అఖండ యూనిట్ తో సరదాగా డైలాగులు చెబుతూ బాలయ్య అలరించాడు. ఈ నెల 10న ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అవ్వనుంది. ఇందులో ‘తప్పుడు ప్రచారం.. వెన్నుపోటు పొడిచారు. చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని బాలయ్య ప్రోమోలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ , చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ పై మాట్లాడినట్టు తెలుస్తోంది.