నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం

Google+ Pinterest LinkedIn Tumblr +
సిని హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణాలో ఓటర్ ఐడి ఉండగా బాలకృష్ణ ఓటు రాజకీయాల మీద ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తూనే ఉన్నాయి. అయితే 2019లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణాలో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి అవకాశం ఇస్తున్నారు. అంతేకాదు ఓట్లు కొన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కుని మార్చుకున్నారు.
ఏపిలో హిందూపురలోని చౌడేశ్వర కాలనీలో తమ నివాసానికి ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. బాలకృష్ణ భార్య వసుంధర కూడా హిందూపురంలో ఉన్న నివాసం మీద ఓటు హక్కు మార్చుకుంటున్నారట. ప్రతిపక్షాలకు చెక్ పెట్టే ఆలోచనతోనే బాలకృష్ణ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
Share.