కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్న్యాయంగా …. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తూ…తెలుగుదేశాన్ని స్థాపించి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎనిమిది నెలల్లో అధికారాన్ని సొంతం చేసుకున్న నాయకుడిగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ మహానాయకుడిలో ఈ సన్నివేశాలన్నీ ఉండబోతున్నాయి.
. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ సీఎంగా… కనిపించనున్నారు. ఈ చిత్రంతో పాటు ఆ తరువాత చిత్రంలోనూ బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని సమాచారం. మహా నాయకుడు చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆ చిత్రం తెరకెక్కేందుకు సిద్ధం అవుతోంది. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది.
ఆ రెండు చిత్రాల తరహాలో ఇందులోనూ బాలక్రిష్ణ కోసం బోయపాటి రెండు పాత్రలు డిజైన్ చేశారట. రెండింటిలో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న బాలయ్య ఎమ్యెల్యే గా ఉన్నారు. నిజజీవితంలో కూడా ఈ విధంగానే సీఎం సీటు పై బాలయ్య కన్నేస్తున్నారా అనే సెటైర్లు కూడా పడుతున్నాయి.