Badla Ganesh తెలుగు ప్రేక్షకులకు నటుడుగా నిర్మాతగా పేరు పొందారు బండ్ల గణేష్(Badla Ganesh). బండ్ల గణేష్ తరచూ ఏదోక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో తరచూ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు బండ్ల గణేష్. సినిమాలలో ఈ మధ్యకాలంలో నటించకపోయినప్పటికీ ఏదో ఒక విషయంపై స్పందిస్తూనే ఉంటారు. కానీ బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి ఎన్నోసార్లు తెలియజేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా కానీ లేకపోతే రాజకీయపరంగా కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వారిపైన ఆగ్రహాన్ని తెలియజేస్తూ ఉంటారు. తాజాగా మరొకసారి వార్తలలో నిలిచారు బండ్ల గణేష్ .ఆయన చేసిన ఒక ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతోంది. అప్పట్లో బీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఈవెంట్ కు తనకు ఆహ్వానం ఇవ్వలేదని బండ్ల గణేష్ త్రివిక్రమ్ పైన విరుచుకు పడడం జరిగింది.
ఆ తర్వాత బండ్ల గణేష్, త్రివిక్రమ్ కలిసి సారీ కూడా చెప్పినట్లు తెలిపారు. ఇదంతా ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ కు మధ్య మాటలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ ఏదైనా ట్వీట్ చేశాడంటే చాలు అది కేవలం పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని తాజాగా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ కి దూరం కావొద్దు అన్నా అంటూ ఒక ట్విట్ చేయడం జరిగిందట
పవన్ కళ్యాణ్ ను కలుపుకొని వెళ్లండి అంటు సలహా ఇవ్వడంతో దానిపైన రియాక్ట్ అయిన బండ్ల గణేష్ మన దేవుడు పవన్ కళ్యాణ్ మంచివారు.. కానీ డాలర్ శేషాద్రి తోనే ప్రాబ్లం ఏం చేద్దాం అంటూ ట్విట్ చేయడంతో అది వైరల్ గా మారుతోంది . ఈ ట్వీట్ త్రివిక్రమ్ పైనే చేశారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది నేటిజన్స్ బండ్ల గణేష్ పైన మండిపడుతున్నారు.
మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………! https://t.co/QwK0vGQlcZ
— BANDLA GANESH. (@ganeshbandla) March 18, 2023