ఇక ఈ వారం వస్తోన్న మరో సినిమా ఆవిరి. రవిబాబు ఈ సినిమాకు దర్శకుడు, ఇందులో హీరో కూడా ఇతడే. రవిబాబు సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ఆవిరి కూడా అలాంటిదే. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ చూసిన తర్వాత ఆవిరి ఎలాంటిదనే విషయంపై అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.
టీజర్ తోనే భయపెట్టిన రవిబాబు, సినిమాతో మరింత భయం కలిగించడం గ్యారెంటీ. పైగా ఈ సినిమాపై నమ్మకంతో దిల్ రాజు దీన్ని రిలీజ్ చేస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించాడు. ‘ఈ ఇంట్లో రాజ్ కుమార్ రావు అతని ఫ్యామిలీ నివసిస్తుంది. వారితో పాటు ఒక ఆత్మ కూడా ఉంది.. దానిని మీరు కనిపెట్టగలరా’? అంటూ రిలీజ్ చేసిన ‘ఆవిరి’ టీజర్లకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సెన్సార్ టీమ్..ఎటువంటి కట్స్ చెప్పకుండా.. U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఫస్ట్ లుక్‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. నేహా చౌహాన్, శ్రీ ముఖ్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులు నటించిన ఆవిరి ఆడియన్స్‌ని భయపెట్టడానికి, థ్రిల్‌కి గురిచేయడానికి శుక్రవారం థియేటర్లలోకి దిగుతోంది. ఇక గత కొంత కాలంగా తన రేంజ్‌కు తగిన హిట్ లేని రవిబాబు ఆవిరితో అయినా మెప్పిస్తాడామే ? చూడాలి.