సౌత్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసిన ఆవికా గోర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ఆవికాగోర్.. మొదట ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించడంతోపాటు మరికొన్ని ఆఫర్లు కూడా అందుకుంది.. నాగార్జున నిర్మాతగా తెరకెక్కించిన ఉయ్యాల జంపాల సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత మళ్లీ సినిమా చూపిస్తా మామ సినిమాని కూడా తెరకెరకెక్కించగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.

TV actress Avika Gor wanted to quit acting! Here's the reason | Tv News –  India TV

ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.. చివరిగా రాజు గారి గది-3 సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆవికాగోర్ కొన్ని చిన్న సినిమాలలో నటించిన బాగానే సక్సెస్ అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెపోటిజం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా ఎక్కువగానే ఉందంటూ పలు వివాదాస్పదమైన వాక్యాలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ అంతా స్టార్ హీరోల పవర్ మీదే నడుస్తుందని తెలిపింది.బాలీవుడ్తో పోలిస్తే సౌత్లో నెపోటిజం చాలా ఎక్కువగానే ఉందంటూ తెలిపింది ఆవికా గోర్.. హిందీ సినిమాల విషయంలో సౌత్ లో పక్షపాతం ఉందని తెలియజేసింది.

సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమిక్స్ అవుతూ ఉండగా ఇక్కడి ప్రేక్షకులు ఆ చిత్రాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ సౌత్ ప్రేక్షకులు మాత్రం బాలీవుడ్ సినిమాలను చూడడానికి ఇష్టపడాలని తెలిపింది టాలీవుడ్ ఇండస్ట్రీ బంధుప్రీతితో ఎక్కువగా ఉందని ఇక్కడి ప్రజలు దానిని ఇష్టపడతారని ఆవికాగోర్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆవికా గోరుచేసిన ఈ వాక్యాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Share.