టాలీవుడ్లో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న హీరోలతో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో తన అందాల ఆరబోత కాస్త ఎక్కువగా చూపిస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. స్టార్ హీరో భార్య అని ఎక్కడ తగ్గకుండా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో తన అందాలను చూపిస్తూ అందరికి షాకిస్తోంది. అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.
వివాహం తర్వాత తన భార్య సపోర్టుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఇక సోషల్ మీడియాలో ఎన్నో సంవత్సరాల తర్వాత యాక్టివ్ గా ఉండడం మొదలు పెట్టింది స్నేహ రెడ్డి. ముఖ్యంగా అల్లు అర్జున్ ని సంబంధించి ఎలాంటి విషయాన్నైనా షేర్ చేస్తూ ఉండేది. ఇక తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది స్నేహ రెడ్డి. అలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది.
అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్లిన వెకేషన్కు సంబంధించి ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడుతోంది స్నేహ రెడ్డి .అందం విషయంలో కూడా ఎక్కడ అసలు తగ్గడం లేదు.. తన బాడీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ అందరి దృష్టిలో పడుతోంది. తాజాగా కొన్ని ఫోటోలను షూట్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలను గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చీరకట్టులో కాస్త వెరైటీగా కనిపిస్తోంది స్నేహారెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.