ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అఫ్ఘాన్ మ్యాచ్ డ్రా అవడం తప్ప ఈ సీరీస్ లో ఇండియా అన్ని మ్యాచ్ లను గెలుస్తూ వచ్చింది. ఇక బంగ్లాదేశ్ కూడా సమర్ధవంతమైన ఆటతీరుతో ఫైనల్స్ కు చేరింది. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లో కూడా సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు బంగ్లాపై కూడా విజయం సాధించాలని చూస్తున్నారు.
ఆసియా కప్ లో హాట్ ఫేవరేట్ అయిన భారత జట్టు బంగ్లాను చిత్తుగా ఓడించడం ఖాయమని అంటున్నారు. బౌలింగ్ కు అనుకువగా ఉండే దుబాయ్ పిచ్ లో టాస్ ఎంతో ప్రాముఖ్యత కానుంది. సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్న ఈ మ్యాచ్ విన్నర్ ఎవరవుతారో వేచి చూడాలి. ఆసియా కప్ ఫైనల్ లో భాగంగా ఇప్పుడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. గత మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న రోహిత్, ధావన్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్ తిరిగి జట్టులో జాయిన్ అయ్యారు. ఇక బాంగ్లాదేశ్ టీం లో మామినుల్ స్థానం కోల్పోగా, నజముల్ ఇస్లాం జట్టు లో స్థానం సంపాదించారు.
