టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాప్సి.. ఆ తరువాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది..ఆ తరువాత టాలీవుడ్ లో నుంచి బాలీవుడ్ కి మకం మార్చేసింది. అక్కడ కూడా వరుసగా లేడీ ఓరియాంటెడ్ అంటే కథ చిత్రాలలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న తాప్సి ఇటీవల నిర్మాతగా కూడా మారింది. ఈ మధ్యనే వీక్ ధక్ .. అనే హింది చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బైక్ రైడ్ కథాంశంతో రూపొందించిన లేడీ ఒరియాంటెడ్ చిత్రం. ఇది అయితే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇటీవల విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సి ప్రస్తుతం సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టార్స్ మీదే ఎంత మొత్తం పెట్టుబడి పెడితే అంతకంటే ఎక్కువ పెట్టుబడి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రఖ్యాతలు ఇవ్వడం జరుగుతుందని..ఇక ఓటిటి ప్లాట్ ఫామ్ లోను ఇదే పరిస్థితి నెలపొందని ఆమె వాపోతోంది. ఇది చాలా విచారించాల్సిన విషయమే అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.
తాను ఓ చిత్రాన్ని నిర్మించాలన్న సహాయ నటుల అర్హత ఏంటన్నది చూడనని చెప్పింది.. అయితే స్టార్స్ తో లేని చిత్రాలను ఓటీటి లోకి నెట్టాలని చూస్తున్నారని అలాంటి భావన సినిమాకు మంచిది కాదని అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది . పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను తొక్కేస్తున్నాయని ఇలాంటి పరిస్థితులు మారాలని తాప్సి పేర్కొంది. ఇప్పుడు తాప్సి తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అని అనిపిస్తోంది..బాలీవుడ్లో పలు సినిమాలతో సందడి చేస్తోంది ఈ అమ్మడు.. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.