అరుదైన ఘనత సాధించిన మెగా కోడలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా కోడలు గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన మామకు తగ్గట్టుగానే సహాయం చేయడంలో దిట్ట అని నిరూపించుకుంది. ఇక మెగా ఫ్యామిలీ కి కోడలు కాకముందు నుంచి ఇప్పటి వరకు ఈమె అపోలో ఫౌండేషన్.. వైస్ చైర్మన్ గా, మెగా కోడలుగా ఉపాసన చేస్తున్న పనుల వల్ల ప్రతి రోజు ఆమె గౌరవం కాస్త పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు అదే విధంగా మరొక అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుంది మెగా కోడలు. అదేమిటంటే..UAE ప్రభుత్వం మెగా కోడలికి గోల్డెన్ వీసా ను అందించింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. దీనిని ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందుకున్నారని తెలియజేసింది. భారతదేశంలో ఎక్స్ పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఈ బహుమతి లభించింది అని చెప్పుకొచ్చింది. గోల్డెన్ వీసా లభించడంతో ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఉంది అంటూ ఆమె తెలిపింది.

ఇక ఈ గోల్డెన్ వీసా వల్ల ఉపయోగం ఏమిటంటే.. UAE లో బిజినెస్, ఉద్యోగం, చదువు కొరకు వెళ్లాలనుకునే వారికి ఎవరైనా అక్కడుండే వారు స్పాన్సర్ చేయవలసి ఉంటుంది.. కానీ ఈ గోల్డెన్ వీసా వల్ల.. ఇలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గానే వెళ్ళవచ్చు. ఈ వీసా వల్ల అక్కడ మీరు కూడా ఒక పౌరుడు లాగానే ఉండవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి గోల్డెన్ వీసాను ఎంతోమంది దక్కించుకున్నారు. అది కూడా మన ఇండియాలో అవడం గమనార్హం. అందులో ముఖ్యంగా సానియా మీర్జా, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, హీరోయిన్ త్రిష.. మరికొంత మంది గాయకులు, బోనీకపూర్ కుటుంబం ఈ వీసా ను దక్కించుకున్నది. ఇప్పుడు ఈ ఘనత ఉపాసన అందుకున్నది.

Share.