అరుదైన రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కుమార్తె..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ కుమార్తె అర్హ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అర్హ కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్నట్లు గా సమాచారం. అతి చిన్న వయసులోనే చెస్ లో వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రఖ్యాత నోబెల్ అవార్డును అందుకుంది. చిన్నవయసులోనే చెస్ ఆడడమే కాదు.. ఎంతో మందికి చెస్ లో ట్రైనింగ్ కూడా ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

హైదరాబాదులో హైటెక్ సిటీకి చెందిన రామ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ చెస్ లో శిక్షణ తీసుకుంటోంది. ఆ తర్వాత ఆమె తన తోటి స్నేహితులకు,తన ఇంట్లో పనిచేసే వారికి కూడా చెస్ లో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ తంతులోనే రెండు నెలల వ్యవధిలోనే సుమారుగా 50 మందికి పైగా చెస్ లో ట్రైనింగ్ ఇచ్చింది.

దీంతో అర్హ ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాతి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి ఆర్బిటర్ చొక్కలింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హకు తాజాగా నైపుణ్య పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలలో అల్లు అర్హ తన సత్తా చాటింది. దీంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డును అందించారు. ఈ అవార్డును అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ల సమక్షంలో అందుకుంది అర్హ.

Share.