సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రజినీకాంత్.. ఆయన ఈ మధ్యనే జైలర్ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక ఈ సినిమాలో విలన్ గా వినాయక్ నటించి తన పాత్రకు ఎంతో న్యాయం చేశాడనే చెప్పాలి. ఈ సినిమా ఆగస్టులో విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది.ఇందులో మలయాళ నటుడు వినాయక్ విలన్‌గా నటించారు. ఆయన తన నటనతో సినీ ప్రముఖులు, అభిమానుల మన్ననలను పొందారు. తన నటనతో చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు.
ఇది కాస్త పక్కన పెడితే వినాయక్ ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వినాయక్ మాత్రం కేరళ చిత్ర సీమలో కాస్త విభేదాలు ఉన్నాయట. ఓపెన్ గా తనకు చాలా మంది మహిళలతో పరిచయం ఉందని వినాయక్ ఒకసారి వేదికపై చెప్పడం ఇలా ఆయనపై పలు వివాదాలు ఉన్నాయి. ఇలాంటి నటుడు వినాయక్ ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..?
వివరాల్లోకెళ్తే.. మంగళవారం నాడు మద్యం మత్తులో ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన వినాయక్ అక్కడి అధికారిపై దాడి చేసి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో ఎర్నాకుళం నార్త్ పోలీసులు వినాయక్ ను అదుపులోకి తీసుకున్నారట. పోలీసు స్టేషన్‌లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇక వినాయక్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించేందుకు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నటుడు వినాయక్ ని ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా వినాయక్ అంత గుర్తింపు తెచ్చుకొని ఇలాంటి పనులు చేయటం చాలా బాధాకరంగా ఉంది అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.