ఈ రోజు ప్రముఖ హీరో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు, అయితే హరి కృష్ణ మృతి చెందటంతో అయన పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు నాగార్జున. ఇవాళ విడుదల కావాల్సిన దేవా దాస్ ఫస్ట్ సింగల్, మరియు శైలజ రెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా వాయిదా వేశారు.
నటుడు అక్కినేని అఖిల్ తన తండ్రి నాగార్జున కి బర్త్ డే విషెస్ చెబుతూ ట్విట్టర్ ద్వారా ” ప్రతి ఒక్కరు తమ ఫాదర్ పై ఒక్క మాట చెప్పాలని ” కోరుతూ, తన తండ్రికి ఈ విధంగా విషెస్ చెప్పారు… ” హ్యాపీ బర్త్ డే నాన్న, మీరు నాకు ఎంతో ఆదర్శం, ప్రతి సంవత్సరం మీ నుండి నేను స్ఫూర్తి పొందుతూనే ఉంటాను..మీరు అందరి కంటే ది బెస్ట్ డాడీ, మీకు ధన్యవాదాలు లవ్ యూ డాడీ ” అని తెలిపారు హీరో అఖిల్.
దీనికి స్పందించిన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నా తండ్రి ( బోనీ కపూర్ ) ఒక లెజెండ్ అని ట్వీట్ చేసారు.
Legend !!! https://t.co/16bvxbrCHV
— Arjun Kapoor (@arjunk26) August 29, 2018