సౌత్ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత దశాబ్దం కాలం పాటు కొనసాగింది. హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఐటెం సాంగులను చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అప్పట్లో ఆమె ఐటెం సాంగ్లను చూసి చాలామంది మంత్రముగ్ధులు అయ్యారు. తన కళ్ళతోనే ప్రేక్షకులను మత్తులో ముంచెత్తేది సిల్క్ స్మిత. ఇంకా చెప్పాలంటే తన కళ్ళే తనకు ప్లస్ పాయింట్ తన అందం తనకు బలం
సిల్క్ స్మిత నాలుగవ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత 15 ఏళ్లకే పెళ్లి చేసుకుంది.తన జీవితం సాఫీగా సాగకపోవటంతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ చేరుకుంది. అక్కడ మలయాళ దర్శకుడు ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మంచి హీరోయిన్ గా ఎదిగి వైభోగాలను అనుభవించిన సిల్క్ స్మిత ఎందుకో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకుంది.అంతేకాకుండా తను చనిపోవటానికి ముందు లెటర్ కూడా రాసి చనిపోయింది.
ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది.. జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు తనను మోసం చేసిన వారు ఇలా తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేసింది.ఆమె రాసిన మాటలు చదివితే ఎవరి కళ్ళనుండైన నీరు రావాల్సిందే.. లేఖలో తన ఆవేదనను ఇలా చెప్పుకొచ్చింది. తను ఏడో ఏట నుంచి పొట్టకూటి కోసం ఎన్నో కష్టాలు పడ్డానని నాకోసం ఎవరూ లేరు అని నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారని.. బాబు తప్ప నాకు ఎవరూ లేరు. తను మాత్రమే నన్ను అర్థం చేసుకున్నాడు. రాము, రాధాకృష్ణ నన్ను మోసం చేశారు దేవుడే వారిని శిక్షిస్తాడు అని తన మనసులోని ఆవేదనను లేఖ రూపంలో రాసింది సిల్క్ స్మిత.. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.
నాకు ఒకడు జీవితాన్ని ఇస్తాడని లైఫ్ లోకి వచ్చాడు ప్రతి ఒక్కరూ నా రెక్కల కష్టం మీద తినేవాడే అంటూ నన్ను మోసం చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత తన సెక్రటరీ అయినా రాధాకృష్ణను పోలీసులు అతడిని విచారించారు.