తెలుగు సినిమా స్థాయిని ఈ సినిమాలు తగ్గిస్తున్నాయా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగు సినిమా అంటే ప్రపంచ స్థాయిలో ఒక మార్కెట్ ఉందని చెప్పవచ్చు. రాజమౌళి సినిమాలు.. పుష్ప, కార్తికేయ-2 సినిమాలు తెలుగుజాతిని బాగా పాపులర్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది హీరోలు లుంగీలు కట్టుకొని కత్తులతో నరకడాలు వంటివి చేస్తూ ఉండడంతో సినిమాలు ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు చూసేవారికి ఎలా ఉన్నా తీసే దర్శకులకైన బుర్ర పనిచేస్తుందా లేదా అని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నట్లు సమాచారం. హీరో ఇజం పేరుతో అభిమానులను మెప్పించాలనే ఉద్దేశంతోనే కమర్షియల్ ఫార్ములా ఉండాలని ఆలోచించడం వరకు ఓకే.. అయితే ఇప్పటికే కమర్షియల్ లెక్కలు అంటే లుంగీలు కట్టుకొని డైలాగులు చెబుతూ నరుక్కుంటూ వెళ్లడమేనా అంటూ అభిమానులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Sankranthi Clash: Chiru scoring over Balakrishna? - TeluguBulletin.com

కానీ అభిమానులను ఇంప్రెస్ చెయ్యాలి అంటే ఏదైనా కొత్తగా ఆలోచించాలని వార్తలు వినిపిస్తున్నాయి. కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమాను తీసుకుంటే ఇంటర్వెల్ సీన్ల తనను తాను రీవిల్ చేసుకోవడం సాధారణ ప్రేక్షకుడికి కూడా ఊపు వచ్చేలా కనిపిస్తుంది. ఈ చిత్రంలో హీరోనీ చాలా కొత్త ఫార్మేట్లో చూపించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఇంటర్వెల్స్ ఇన్ అద్భుతంగా ఉంది ఎలాంటి భారీ డైలాగులు లేకుండా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా చేశారు డైరెక్టర్ బాబి

భారీ బడ్జెట్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా కేవలం డైలాగులు నరకటంతోనే ఎక్కువగా వైలెన్స్ ను చూపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీతారామం, కార్తికేయ-2 వంటి సినిమాలు చూసి అభిమానుల ఆ తర్వాత టేస్ట్ పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లోనైనా ఇంతటి వైలెన్స్ అని మన డైరెక్టర్లు తగ్గిస్తారేమో చూడాలి మరి.. సరికొత్త కథ అంశంతో ఎలాంటి సినిమా అయినా విడుదలయితే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నారని చెప్పవచ్చు.

Share.