టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టిస్తున్న డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి.. ఎందుకంటే ఈయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు.. బాహుబలి ఆ తరువాత ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు.. చాలామంది ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. ఎందుకంటే ఆయన కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఆయన సినిమాలో నటించిన హీరో కచ్చితంగా స్టార్ హీరో అవ్వడం ఖాయం.
అయితే గతంలో ఓ స్టార్ హీరో కూడా తన కొడుకుని రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఒక సినిమాలో హీరోగా తీసుకోమని అడిగారట. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో యముడు పాత్రలో నటించాడు మోహన్ బాబు.అయితే ఆ సినిమా టైంలోనే మోహన్ బాబు నా కొడుకు విష్ణువుని నీ డైరెక్షన్లో ఒక సినిమా తీయండి అని అడిగారట. అయితే రాజమౌళి కూడా ఆ విషయానికి ఓకే చెప్పి త్వరలోనే ఒక సినిమాలో మీ కొడుకుని హీరోగా తీసుకుంటాను అని చెప్పాడట.
అయితే రాజమౌళి కాస్త సమయం పడుతుంది అంతవరకు వెయిట్ చేయండి అని మోహన్ బాబుతో చెప్పాడట. కానీ మోహన్ బాబు వినకుండా నీ నెక్స్ట్ సినిమాలో హీరోగా విష్ణువుని పెట్టుకోవాలి అని ఒత్తిడి చేయడంతో రాజమౌళి నేను మీ కొడుకుని తీసుకోను ఆల్రెడీ నేను వేరే హీరోని సెలెక్ట్ చేసుకున్నాను అన్నారట. దాంతో మోహన్ బాబు కి రాజమౌళి పై కోపం అలాగే కక్ష పెట్టుకున్నాడని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ వినిపించేవి.
కానీ రాజమౌళి తన స్వయంకృషితోనే ఇండస్ట్రీలోకి పైకి ఎదిగారని చెప్పవచ్చు. అందుచేతనే రాజమౌళిని మోహన్ బాబు ఏం చేయలేకపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.