నందమూరి తారకరత్న గురించి గత కొద్దిరోజులుగా రోజుల నుండి మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయనకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో బయటపడుతూనే ఉంది. తాజాగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తో గొడవలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ గొడవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టిడిపి పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్.అలా ఏర్పాటుచేసిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు.
కొన్ని సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా తన వారసులకు కాకుండా తన అల్లుడికి ఆ పదవిని ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు నాయుడుని సీనియర్ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పదవి పొందాడని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా అప్పట్లో నందమూరి హరికృష్ణ చంద్రబాబు నాయుడుకి పూర్తి వ్యతిరేకంగా ఉండేవారట. దాంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం హరికృష్ణ ఫ్యామిలీని దూరం పెట్టిందనీ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అలాగే హరికృష్ణ రెండో భార్య కొడుకు జూనియర్ ఎన్టీఆరే..ఆయనని కూడా సినిమాల్లో ఎదగనీయకుండా తొక్కేయాలని తారకరత్నని జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా దించారని వార్తలు వినిపించాయి. ప్రతి విషయంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ తొక్కేసిందని అప్పట్లోకొన్ని వార్తలు వినిపించాయి. సినిమాల పరంగా కూడా వీరి మధ్య గొడవలు జరిగాయని అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవాలే అని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు తారకరత్న
తారకరత్న ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. ఈ ప్రచారం జరుగుతున్న మొత్తం అవాస్తవమే.. కావాలని కొంతమంది మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమందరం నందమూరి వారసులమే మేం కలిసే ఉంటాం లేనిపోని గొడవలు మా మధ్య సృష్టించవద్దని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.