సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటులకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని అనుకుంటూ ఉంటారు.. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదని కొంతమంది నటులని చూస్తే అర్థమవుతుంది. కొంతమంది సినీ ఇండస్ట్రీలో తన నటనతో వరుస ఆఫర్లను తెచ్చుకుంటూ.. ఆర్థికంగా మెరుగు పడుతుంటే మరికొంతమందికి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటివారిలో ఛత్రపతి చంద్రశేఖర్ కూడా ఒకరు. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాలలో కూడా ఈయన అవకాశాలను తెచ్చుకోవడం గమనార్హం.
ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈయనకు ఇప్పటికీ ఆర్థిక కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇక చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాడు. పదవ తరగతి వరకు చదువుకొని దేవదాసు కనకాల యాక్టింగ్ స్కూల్లో చేరిన ఈయనను దర్శకుడు రాజమౌళి చూసి నీ నటన నాకు బాగా నచ్చింది.. శాంతినివాసం సీరియల్ లో నటిస్తావా అని అడిగారట. ఇక ఆ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో ఈయన నటించాడు. చత్రపతి సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన పేరును అప్పట్నుంచి ఛత్రపతి చంద్రశేఖర్ గా పిలుస్తున్నారు.
ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో తన భార్యను మోడలింగ్ కోర్స్ లో చేర్పించాడు. ప్రస్తుతం ఈయన టీవీ రంగంలో కొనసాగుతూ సీరియల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు.