యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే యూ ఎస్ ఏ లో మాత్రం ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. ఇక ప్రీమియర్ షోస్ ద్వారా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించిందని సమాచారం. యూ ఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొత్త రికార్డ్స్ నమోదు చేసి తదుపరి వచ్చే స్టార్ హీరోల సినిమాలకు ఒక టార్గెట్ సెట్ చేసారు ఎన్టీఆర్.
అమెరికా లో అరవింద సమేత సుమారు 179 లొకేషన్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా 459,000 (స్టిల్ కౌంటింగ్) డాలర్లను వసూలు చేసిందని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా యూఎస్ లో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఏపీ లో ఇప్పటికే ఈ సినిమాకి అదనంగా షోస్ ప్రదర్శించటానికి పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.