అరవింద సమేత వీరా రాఘవగా వచ్చిన ఎన్.టి.ఆర్ తన సత్తా చాటుతున్నాడు. గురువారం రిలీజైన ఈ సినిమా వసూళ్ల దందా కొనసాగిస్తుంది. బాక్సాఫీస్ వేటలో ఎన్.టి.ఆర్ చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో 26.75 కోట్ల షేర్ సాధించిన అరవింద సమేత రెండో రోజు కూడా తన హవా కొనసాగించింది.
రెండు రోజుల అరవింద సమేత కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 8.55 కోట్లు
సీడెడ్ : 7.45 కోట్లు
ఉత్తరాంద్ర : 4.01 కోట్లు
ఈస్ట్ : 3.24 కోట్లు
వెస్ట్ : 2.69 కోట్లు
గుంటూరు : 4.82 కోట్లు
కృష్ణా : 2.51 కోట్లు
నెల్లూరు : 1.33 కోట్లు
ఏపి/ తెలంగాణా కలిపి రెండు రోజుల్లో 36.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అరవింద సమేత.