యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో దీనిపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో తారక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు జనాలు పట్టం కట్టారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా తారక్ స్టామినా ఏమిటో మనకు తెలిపింది.
కాగా ఈ సినిమాను ఇటీవల బుల్లితెరలో టెలికాస్ట్ చేశారు. అందరి అంచనాలను తారు మారు చేస్తూ ఈ సినిమా రికార్డ్ స్థాయిలో టీఆర్‌పీ దక్కించుకుంటుంది అని అనుకున్నారు అందరు. కానీ అరవింద సమేత టీవీ టెలికాస్ట్‌కు సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో చాలా తక్కువ టీఆర్‌పీ నమోదైంది. ఈ సినిమాకు కేవలం 13.7 టీఆర్‌పీ రావడం గమనార్హం. ఇది రంగస్థలం(19.51), భరత్ అనే నేను(17) చిత్రాలకంటే తక్కువగా ఉండటం గమనార్హం.
సంక్రాంతి పండుగ పూట తమ అభిమాన నటుడి సినిమాను చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు తారక్ ఫ్యాన్స్. అయితే ఈ టీఆర్‌పీ రేటింగ్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి కామెంట్ చేయలేదు.