ఏపీ ప్రజలకు ప్రభాస్ సహాయం..ఎన్ని కోట్లంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వరదలు రావడంతో కొన్ని ప్రాంతాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ దుర్ఘటనకు గాని టాలీవుడ్ స్టార్ హీరోలు కొంతమంది స్పందించడం జరిగింది. దానితో పాటే ఒక్కొక్కరు వారికి తోచిన విధంగా సహాయం కూడా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరో ప్రభాస్ తన ఉన్నతమైన మనసును చాటుకొని భారీగా సహాయాన్ని అందించారు. గతంలో కూడా ఎన్నోసార్లు సహాయం చేశారు ప్రభాస్.

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా, వరదలతో కొన్ని ప్రాంతాలు ముంచెత్తాయి. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు. అయితే ప్రభుత్వం వాళ్లను ఆదుకోవడానికి తన వంతు సహాయం చేస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు నిర్మాతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు. తాజాగా ప్రభాస్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. తన తరుపున కోటి రూపాయలు విరాళం అందించినట్లు గా ప్రభాస్ ప్రకటించారు.

ప్రభాస్ గతంలో కూడా హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు అందించడం జరిగింది. కరోనా సమయంలో ఏకంగా 5 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ప్రభాస్ తన గొప్ప మనసుతో ఇలా సహాయం చేస్తూనే ఉన్నాడు.

Share.