తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అనుష్క శెట్టి. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె దొరకడం చాలా కష్టంగా మారింది. వరుసగా తెలుగు ,తమిళ భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సినిమాలు పక్కన పెట్టి రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది..తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరీ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించారు.
కాని రామ్ చరణ్ తో మాత్రం ఆమె నటించలేదు అందుకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం ఓక న్యూస్ వైరల్ గా మారుతోంది.. మరి ఇందులో ఎంతటి నిజం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.అనుష్కకి, రామ్ చరణ్ తో ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడుసార్లు ఆయనతో నటించే అవకాశం వచ్చిందట. కానీ అనుష్కానే వాటికి నో చెప్పిందట.
ఇంతకు రామ్ చరణ్ ,అనుష్క కాంబినేషన్లో రావాల్సినా సినిమాలు ఏంటంటే మగధీర, రచ్చ, గోవిందుడు అందరివాడే ఈ సినిమాలన్నింటికీ అనుష్కనే హీరోయిన్గా అనుకున్నారట. కానీ అనుష్క ఆ సినిమాలకు నో చెప్పిందట. అయితే దానికి కారణం ఏంటంటే అప్పట్లో అనుష్క చాలా బిజీ హీరోయిన్ కాబట్టి అప్పుడు వేరే సినిమాలో నటించడం వల్ల వీటికి నో చెప్పిందట.
ఇలా అనుష్కకి మూడుసార్లు రాంచరణ్ తో సినిమాకి అవకాశము వచ్చినప్పుడు అనుష్క వదులుకున్నారు అంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే అనుష్క శెట్టి రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ పుంజుకుంటోంది. మొన్నటి వరకు అనుష్కకు చాన్సులు రాలేదు ఇప్పుడు మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో కాస్త ఈ అమ్మడు ఊపు అందుకుంది. ఏదేమైనా అనుష్క మళ్ళీ సినీ రంగంలో బిజీగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.