తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటగా సూపర్ సినిమాతో పరిచయమయ్యింది హీరోయిన్ అనుష్క శెట్టి.. ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.అనుష్క ఈమధ్య ఇండస్ట్రీకి దూరమయిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి, బాహుబలి 2 సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను దక్కించుకుంది. అనుష్క కానీ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది.ఈ బ్యూటీ ఇక ఆ సినిమాల తరువాత సైరా నరసింహారెడ్డి, నిశ్శబ్దం వంటి చిత్రాలులో నటించింది. కానీ ఆమెకి ఆ సినిమాలు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. నిశ్శబ్దం సినిమా అయితే థియేటర్లకు రాకముందే ఓటిటిలో రిలీజ్ కావటం వల్ల అనుష్క చిత్రని థియేటర్లలో చూడలేకపోతున్నారు అభిమానులు.
ఇక అనుష్క వయసు 41 సంవత్సరాలు అయినా పెళ్లి ప్రస్తావనలు ఏవి బయటకి రావడం లేదు. అనుష్క బరువు పెరగడం వల్లే ఆమె సినిమాలు డిలే అవుతూ వచ్చాయి.అయితే ఇప్పుడు అనుష్క గురించి ఒక టాపిక్ బయటపడింది. అదేమిటంటే ఆమె షూటింగ్‌ను ఓ 15 నిమిషాల పాటు ఆపేస్తుందట. ఇంతకీ అనుష్క ఎందుకు అలా చేస్తోంది ఆమె బాధపడుతున్న సమస్య ఏంటి అనుకుంటున్నారా? అదే నవ్వు సమస్య అవును అనుష్కకి ఓ విచిత్రమైన సమస్య ఉందట. ఒక్కసారి నవ్వు మొదలుపెడితే దాదాపు 15 నిమిషాలపాటు నవ్వుతూనే ఉంటుందట.షూటింగ్ టైంలో అటు ఇటు తిరుగుతూ నవ్వుతుందట.ఈ విషయాన్ని ఈమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే అనుష్క ఇప్పుడు నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో ఓ చెఫ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అనుష్క జీరో సైజ్ సినిమా నుంచి అవకాశాలు తగ్గిపోయాయి అంటూఒకప్పుడు వార్తలు వినిపించాయి. ఆ సినిమా నుంచి ఆమె బరువు తగ్గకపోవటంతో సినిమా అవకాశాలు చేజారిపోయాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.