టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి చేసిన పని వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.. అనుష్క శెట్టి గతంలో సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఎంతమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పవచ్చు. అత్యధిక రెమ్యూనరేషన్ అందుకొనే హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. మొన్నటి వరకు తెలుగు తమిళంలో అగ్ర కథానాయిక గా ఒక వెలుగు వెలిగింది.
కానీ ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే నటిస్తోంది అనుష్క.. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక చిత్రంలో నటిస్తున్నది.గతంలో వేదం సినిమాలో అనుష్క శెట్టి ఒక వేశ్యపాత్రలో నటించింది.. అయితే ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనుష్క ఎంట్రీ సాంగ్ కోసం ఏకంగా బ్రోతల్ హౌస్ కు తీసుకు వెళ్లడం జరిగింది డైరెక్టర్ క్రిష్.. బ్రోతల్ హౌస్ లోని ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే సాంగ్ను కూడా షూటింగ్ చేసినట్లు సమాచారం.
అయితే అక్కడున్న అమ్మాయిలను అనుష్క చూసి చాలా చలించిపోయిందట. వారి యొక్క కష్టాలను చెప్పడంతో అనుష్క కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయని తెలుస్తోంది. డబ్బులు కోసం వాళ్లు పడ్డ కష్టాన్ని అనుష్కతో చెప్పడంతో ఆమె చాలా బాధపడిందట. నిజంగా ఇన్ని బాధలు పడుతున్నారా అంటూ చాలా ఎమోషనల్ అయిందని సమాచారం. తాను ఆ సాంగ్ పూర్తి అయ్యి వచ్చే సమయంలో వారికి కొన్ని డబ్బులు ఇచ్చి వచ్చినట్టుగా తెలియజేసింది అనుష్క శెట్టి.
అయితే ఈ విషయాలను స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అనుష్క శెట్టి కష్టాలలో ఉన్న వారికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుందని చెప్పవచ్చు.. అనుష్క శెట్టి అభిమానులు ఇమే వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం వివాహ విషయాన్ని మాత్రం దాటివేస్తూ వస్తోంది. గతంలో బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించగా మరొకసారి ప్రభాస్ ని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.