ప్రభాస్ ని ఎదిరించిన అనుష్క.. కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్కల ప్రేమ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని అలాగే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై స్పందించిన అనుష్క శెట్టి మేమిద్దరం మంచి స్నేహితులం మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు అని కూడా ఒక సందర్భంలో తెలియజేశారు. అయితే వారి అభిమానులు మాత్రం ఈ మాటకు ఒప్పుకోవటం లేదు. వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అలాగే వారు పెళ్లి చేసుకుంటే వారి ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే అనుష్క, ప్రభాస్ లకు సంబంధించిన గత తాలూక జ్ఞాపకాలను నేటిజన్లు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు.

Watch: Prabhas, Anushka Shetty spotted together at a hospital to see  Krishnam Raju before demise | Telugu Movie News - Times of India

అయితే ఓ సినిమా విషయంలో అనుష్క, ప్రభాస్ ని ఎదిరించి మరీ ప్రభాస్ కి ఇష్టం లేని పని చేసిందట.ఆ సినిమా మరేదో కాదు వేదం. తెలుగు స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అనుష్క శెట్టి మంచు మనోజ్ ,దీక్ష సేత్ ఇలా కొంతమంది ప్రధాన పాత్రలో పోషించారు. ఇక ఈ సినిమా 2017 విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద డిజార్డర్ గా నిలిచింది. కమర్షియల్ గా పెద్దగా హిట్ కాకపోయినా కంటెంట్ పరంగా పర్లేదు అనిపించింది.

Vedam (2010) - IMDb
అయితే ఈ సినిమా కమిట్ అయ్యే విషయంలో అనుష్క శెట్టి కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట ప్రభాస్.ఆ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించటం ప్రభాస్ కు ఇష్టం లేదట.అంతేకాకుండా ఆ పాత్ర ద్వారా నీ కెరియర్ దెబ్బతింటుంది. అంటూ ముందే హెచ్చరించాడట. అయినా ప్రభాస్ మాట వినకుండా ఈ సినిమాకి సైన్ చేసింది. అనుష్క ఆ తర్వాత ఎన్ని తిప్పలు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం అనుష్కకు సంబంధించి ఈ విషయం వైరల్ కావడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా అనుష్క ప్రభాస్ వివాహం చేసుకుంటారమో చూడాలి మరి.

Share.