అనుష్క- ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ రాకపోవడానికి కారణం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచిది గుర్తింపును సంపాదించుకున్నటువంటి వారిలో హీరోయిన్ అనుష్క కూడా ఒకరు.. ఈ అమ్మడు హీరోయిన్ గా సూపర్ సినిమాతో పరిచయమైంది. ఆ తరువాత పలు సినిమాలలో పలు అగ్ర హీరోల సరసన నటించి ఎంతో మంచి గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రభాస్ తో నటించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.అయితే బాహుబలి సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు కనుమరుగయ్యాయి.

South Newsmakers Of The Week: Anushka Shetty's unseen viral photo, Jr NTR  tests COVID 19 positive and more | PINKVILLA

చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది కాస్త పక్కన పెడితే అనుష్క గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..

అనుష్క శెట్టి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన కానీ ఒక స్టార్ హీరోతో నటించలేదు.. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా గ్లోబల్ ప్రైజ్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అవునండి జూనియర్ ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్లో అసలు సినిమానే రాలేదు.. దానికి కారణం ఏంటంటే అనుష్క కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ తో నటించే అవకాశాలు వచ్చాయట. అయితే అప్పుడు ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండటంతో ఫిజిక్స్ పరంగా వీరిద్దరికి మ్యాచ్ అవ్వకపోవడంతో అనుష్క, ఎన్టీఆర్ తో నటించే అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసింది.

ఇప్పుడు ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా తయారయ్యారు కానీ అనుష్క బొద్దుగా తయారయ్యింది.. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశాలు కూడా ఆమెకు రాకపోవటంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. అయితే మునుముందు ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి.

Share.