ఈమధ్య జ్యోతిష్యులు హీరోయిన్ల జీవితాల గురించి బాగానే ఆరా తీస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత చైతన్య విడిపోతారాని మూడేళ్ల కిందట తాను చెప్పానని ఒక స్వామీజీ మీడియా ముందుకు వచ్చి బాగా హల్చల్ చేశాడు. అయితే తాజాగా ఇప్పుడు అనుష్క పెళ్లి విషయంలో కూడా ఒక జ్యోతిష్యుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. అది కాస్తా వైరల్ గా మారుతున్నాయి.
అనుష్క వివాహంపై పలురకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరికీ సరైన సమాధానం మాత్రం రావడం లేదు. అనుష్క వివాహం పై వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తలన్నీ కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. ఇక అనుష్క వయస్సు తాజాగా 41 సంవత్సరాలు అవుతోంది. అనుష్కపై ప్రతిరోజు ఏదో ఒక రూమర్లు వినపడుతూనే ఉన్నాయి. అనుష్క ఇప్పట్లో వివాహం చేసుకోదు అని వార్త కూడా వినిపిస్తోంది. పైగా ప్రభాస్ తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తోందని వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఈ విషయంపై అనుష్క నో అని చెప్పేసింది. అనుష్క తాజాగా ఉన్న పరిస్థితిని చూస్తే అనుష్క ఇప్పట్లో వివాహం చేసుకొనేలా కనిపించలేదు. కేవలం తన ఫోకస్ అంతా సినిమాల మీదే ఉన్నది.అయితే తాజాగా కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక జ్యోతిష్యుడు జేజమ్మ పెళ్లి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుష్క తన వృత్తిలో చాలా సిన్సియర్ గా ఉంటుంది, అలాగే తన ముఖ కవళికలను బట్టి చూస్తే.. ఆమె ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని తెలియజేశాడు. అంతేకాకుండా 2023 లోపల ఈమె పెళ్లి జరుగుతుంది అంటే ఆ జ్యోతిష్యుడు తెలియజేశాడు.