టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొట్టమొదటిగా అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పరిచయమయ్యింది అనుపమ పరమేశ్వరణ్. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.. ఆ తరువాత శతమానంభవతి సినిమాతో ఆమెకి ఇంకాస్త క్రేజ్ పెరిగింది. అలా పలు హీరోలతో మంచి మంచి సినిమా అవకాశాలను చేసే అవకాశం దక్కించుకుంది. ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పెళ్లికూతురు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంటే అనుపమ పెళ్లి చేసుకోబోతోందా..? లేదంటే ఎంగేజ్మెంట్ అయ్యిందా ..?అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న సింగిల్ గా ఉన్న నువ్వు రాత్రికే ఎంగేజ్మెంట్ చేసుకున్నావా అంటూ అనుపమ అభిమానులు అడుగుతున్నారు.
అనుపమ పరమేశ్వణ్ ఒక ప్లాస్టిక్ కవర్ ని తన చేతికి కట్టుకొని ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. దీన్నంతా చూస్తుంటే ఆమె కామెడీగా పోస్ట్ చేసిందని అర్థం అవుతోంది. అయితే అనుపమ పరమేశ్వరన్ ఇలా ఎందుకు పోస్ట్ చేసింది. ఏమైనా అనుపమ జనాలను పిచ్చోళ్లను చేసేక లేదంటే తన పెళ్లి గురించి ఇలా చెప్పిందా..? అంటూ చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ ను చూసి చాలామంది అభిమానులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో అనుపమ పెట్టిన ఫోటోలను చూస్తుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. తను పెళ్లి చేసుకుంటే కుర్రాళ్ళ గుండెలు పగలటం ఖాయం. అయితే ఈమె ఎందుకు ఇలా పోస్ట్ పెట్టిందో ఈ విషయంపై అనుపమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించిన అనుపమ డీజే టిల్లు సీక్వెల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.