అనుభవించు రాజా ఫస్ట్ డే కలెక్షన్స్ మామూలుగా లేవుగా?

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో హిందీ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమాకు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా నవంబర్ 26న విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వారం సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడంతో అనుభవించు రాజా ఈ సినిమా కి మంచి స్పందన వస్తోంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దాదాపుగా 450 పైగా థియేటర్ లలో ఈ సినిమాను విడుదల చేశారు. తొలి రోజే 70 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు 3.90 కోట్ల త్రియేటికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు నాలుగు కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఈ వీకెండ్ లో భారీగా వసూళ్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఈజీగా అవుతుందని చెప్పవచ్చు.

Share.