కొన్ని సార్లు స్టార్ హీరోలతో సినిమాలు తీసిన హీరోయిన్లుకు అస్సులు కలిసిరాదు. అప్ కమింగ్ హీరోలతో కలిసిన నటించినవారికి వరుసగా ఛాన్సులు వస్తుంటాయి. ఇటీవల ఛలో, గీతా గోవిందం లాంటి సినిమాలో విజయ్ దేవరకొండతో నటించిన రష్మిక మందన కు వరుసగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఛాన్సులు వస్తున్నాయి.
పాయల్ రాజ్ పూత్ కి ఇలాగే వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఆ మద్య అజ్ఞాతవాసి, నా పేరు సూర్య , శైలజారెడ్డి అల్లుడు లాంటి సినిమాల్లో నటించిన అనుఇమ్మాన్యుయేల్ కి అస్సలు కలిసి రావడం లేదు. మత్తు కళ్లతో మంచి ఫిజిక్ ఉన్న అను చూడగానే ఇట్టే నచ్చేస్తుంది. కానీ ఈ అమ్మడికి మాత్రం ఛాన్సులు రావడం లేదు..దాంతో ఆమె కెరీర్ గాడి తప్పింది.
చాలా కాలం ఆమె గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా కాలం తర్వాత గోల్డెన్ ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమా చేసే ఛాన్స్ దొరికింది. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాలో ఉండనుంది. అవకాశాలు వచ్చినా అదృష్టం మాత్రం వరించడం లేదు ఈ అమ్మడుని కనీసం ఈ చిత్రమైన ఆమెకు హిట్ కావాలని కోరుకుందాం.