‘అను బేబీ’ వీడియో సాంగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’. ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా గోపి సుందర్ స్వరాలూ సమకూర్చారు. ఇందులో అలనాటి అందాల నటి రమ్య కృష్ణ శైలజ రెడ్డి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాతో తొలి సారి అను, నాగ చైతన్య జంటగా నటించటం మరో విశేషం. ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, నాగ చైతన్య మరియు రమ్య కృష్ణ ల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతలు ఇది వరకే ప్రకటించారు.

నాగ వంశి, రాధా కృష్ణ ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. షఫీ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 31 వ తేదీన విడుదల కానుంది.

Share.