తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభమైన అక్కినేని నాగేశ్వరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈయన చివరి దశలో క్యాన్సర్ బారిన పడి మరణించడం బాధాకరమని చెప్పాలి. ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఇకపోతే తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు చాలామంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు. ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లతో నటించినప్పటికీ ఏ రోజు ఏ ఒక్కరితో కూడా ఎఫైర్ పెట్టుకోలేదు..అంతలా తన భార్యని ప్రేమించేవాడు.
ఆయన భార్య అన్నపూర్ణమ్మ చాలా నెమ్మదస్తురాలు. ఒకానొక సమయంలో వివాదాలకు చోటు ఇవ్వని అక్కినేని నాగేశ్వరరావును కొంతమంది అవమానించడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి.. ప్రతి విషయాన్ని ఎంతో బాగా అర్థం చేసుకొని ఏఎన్ఆర్ ను ముందుండి నడిపించేది. అయితే ఒకానొక సమయంలో ఏఎన్ఆర్ ను కొంతమంది నపుంసకుడు, అసలు మగాడే కాదు, ఆడపిల్లల్ని కన్నెత్తి కూడా చూడడు.. మాట్లాడడు అంటూ అందరూ అంటూ ఉంటే వారి మాటలు విని భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి రెండుసార్లు సముద్రం దగ్గరికి కూడా వెళ్లారట. అలాంటి టైంలోనే అన్నపూర్ణమ్మ అక్కినేని జీవితంలోకి వచ్చింది.
అన్నపూర్ణమ్మ ఆయన జీవితంలోకి రావడంతో ఆయన అదృష్టం మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.. అన్నపూర్ణమ్మ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆయనకు పట్టిందల్లా బంగారమే అయ్యింది. ఓర్పులో భూదేవితో సమానమైన అన్నపూర్ణమ్మ తన భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. తన భర్త ఇతర అమ్మాయిలతో తిరుగుతున్నారు అని ఎంతోమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా వాటిని పట్టించుకోలేదు . అంతేకాదు అలా చెప్పినవారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ మా ఆయన అందంగా ఉంటారు కాబట్టి వారే మా ఆయన వెంట పడుతున్నారు అంటూ మాట్లాడేదట. ఎందుకంటే తన భర్త అంటే ఆమెకు అంత నమ్మకం , ఇష్టం.. ఏఎన్ఆర్ సినిమాలలో బిజీగా తిరుగుతూ ఉంటే తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది అన్నపూర్ణమ్మ. ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అక్కినేని అనే విషయం తెలుసుకొని అభిమానులు మరింత ఫీలవుతున్నారు.