తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ చలపతిరావు అంటే పలువురు సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఈ విషయాన్ని సినీ ప్రేక్షకులు అభిమానులు సైతం జీర్ణించుకోకముందే ఇప్పుడు తాజాగా మరొక తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు, తమిళ్ భాషలలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన ప్రముఖ కళా రచయిత బాలమురుగన్ నిన్నటి రోజున మరణించారు ఈయన ప్రస్తుత వయసు 86 సంవత్సరాలు.
వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఈయన మరణించినట్లుగా ఈయన కుమారుడు భూపతి రాజా మీడియా ముందర తెలియజేయడం జరిగింది. బాలమురుగన్ మృతి పట్ల పలువురు తమిళ తెలుగు సినీ ప్రేమికుల సైతం సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఈయన కెరియర్లో ధర్మదాత ,ఆలుమగలు సాహసగాళ్లు జీవన తరంగాలు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా బంట్రోతు భార్యకి కూడా ఈయన కథ అందించడం జరిగిందట. శోభన్ బాబు నటించిన సోగ్గాడు సినిమా టాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
ఇటువంటి ఎన్నో ఆణిముత్యాలు వంటి కథలు ఆయన చేతి కలం నుంచి జారినవే అని చెప్పవచ్చు .దక్షిణాదిలో స్టార్ రైటర్ గా కొనసాగుతున్న బాలమురుగన్ తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. ఒక్క శివాజీ గణేషన్ కి దాదాపుగా 40 సినిమాలకు పైగా కథలు అందించినట్లుగా సమాచారం. ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది.