మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో తన పాపులారిటీ సంపాదించుకుంది. రష్మిక గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా పలు వివాదాలలో చిక్కుకుంటూనే ఉంటోంది.ఎన్నో రకాలుగా ట్రోల్కు కూడా గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది రష్మిక. లైఫ్ లో మన చుట్టూ అందరూ మంచివాళ్లే ఉంటే మనకి బోర్ కొడుతుంది అందుకే కొంతమంది మనమంటే నచ్చని వాళ్ళు కూడా ఉండాలి అప్పుడే వాళ్ల వల్ల మనం ఎదగడానికి ట్రై చేస్తామని విజయ్ దేవరకొండ తెలియజేశారు.

Rashmika Mandanna to trolls: 'Don't be abusive, it's mentally affecting' -  Hindustan Times

అయితే ఇప్పుడు ఈ విషయాలన్నిటిని రష్మిక తనదైన స్టైల్ లో తెలియజేస్తోంది .కెరియర్ లో తన ఫేస్ చేసిన విషయాలను ఓపెన్ గా మాట్లాడుతూ.. విషయం ఏదైనా సరే సింపుల్గా చెప్పేస్తూ ఉంటుంది. రష్మిక మాట్లాడుతూ తన తల్లిదండ్రులు హాయిగా సాగుతున్న జీవితంలోకి సినిమాలు ఎందుకు అని అన్నారట.. ఆ మాటలు వారు అనడంతో రష్మిక ఇండస్ట్రీలో నెగ్గి చూపిస్తానని తనమీద తనకు చాలా నమ్మకం ఉందని వాళ్లను ఒప్పించి సరికి తల ప్రాణం తోకకు వచ్చిందని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇండస్ట్రీ లోకి వచ్చాక నిలదొక్కుకోవడం మరొక ఎత్తని రష్మిక తెలుపుతోంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతే అంత తేలికైన విషయం కాదు.. నటించగలగామనే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదు ప్రతిరోజు ఇక్కడ పోరాటం చేయాలి ఫ్యాషన్తో పోరాటం ,సోషల్ మీడియాతో పోరాటం, మనతో మనం పోరాటం ఇలా పలు రకాలుగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి అంటూ తెలుపుతోంది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Share.