రష్మిక పై మరొక వివాదం.. ఈసారి ఏకంగా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వివాదాలలో నిలుస్తూ ఉంటోంది. ఇటీవల కాంతారా సినిమాను చూడలేదు అంటూ పేరడీగా సమాధానం చెప్పడంతో కన్నడ అభిమానులు కూడా ఆమెను అసహ్యించుకుంటున్నారు. చివరికి కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసే వరకు ఈ వివాదం వెళ్ళింది.ఆ తర్వాత కొన్ని దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ ముద్దుగుమ్మను క్షమించేలా కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సౌత్ ఇండియా సినిమాల పైన నెగిటివ్ కామెంట్లు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Rashmika Mandanna: రష్మిక మందన్నాకి అంత సీన్ లేదంటున్న కేఆర్‌కే | KRK says  Rashmika Mandanna has no future Bollywood nvs

బాలీవుడ్లో రష్మిక నటించిన మిషన్ మజ్ను సినిమా ఓటీటీ లో వచ్చే నెల విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ సౌత్ ఇండియా సినిమాల్లోని సాంగ్స్ మధ్య పోలికలను తీసుకువచ్చింది.. రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో బాలీవుడ్ బెస్ట్ అని ఈ ముద్దుగుమ్మ చెప్పడంతో పాటు చిన్న వయసు నుంచే ఆ పాటలు చూస్తూనే పెరిగానంటూ తెలియజేసింది. దీంతో దక్షిణాది సినిమాలలో అన్ని మసాలా పాటలే ఉంటాయని చాలా వెటకారంగా కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్ డ్యాన్స్ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి..అంటూ ఎద్దేవా చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక పైన నేటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. సౌత్ సినిమాలలో నటించి పాపులర్ అయిన నువ్వు బాలీవుడ్లో నాలుగు సినిమాలు చేయగానే ఇక్కడ సినిమాలను అవమానిస్తావా అంటూ ఆమె పైన విరుచుకుపడుతున్నారు. ఇక నిన్ను కన్నడ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలోనే బహిష్కరించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share.