ఈమధ్య కాలంలో విడాకులు అనేది ఒక ఫ్యాషన్ గా తయారయ్యింది. చాలామంది సినీ ఇండస్ట్రీలో వారు ఎక్కువగా విడాకుల విషయాల్లో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు.. అందులో సమంత, నిహారిక ఈ మధ్యన వినిపిస్తున్న పేర్లు ఇక వీరిద్దరి పేర్లలోకి యాడ్ అవుతోంది నటి మౌనిక రెడ్డి. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. అయితే వీటితో కాకుండా భీమ్లా నాయక్ సినిమా ద్వారా మౌనికకి గుర్తింపు దక్కింది.
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది. అంతేకాకుండా సూర్య అనే వెబ్ సిరీస్ లో కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే..ఈ మధ్యనే ఒక కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది మౌనిక రెడ్డి. ఇదంతా కాస్త పక్కన పెడితే మౌనిక రెడ్డి ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నది సందీప్ అనే వ్యక్తిని..పెళ్లయ్యాక కొన్ని రోజులు లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేశారు.అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరమీద వినిపిస్తోంది.
దానికి ప్రధాన కారణం మౌనిక రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో వారిద్దరి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం.. అలాగే తన భర్త ఇంస్టాగ్రామ్ అన్ ఫాలో చేయటమే అంటే ఇలా చేస్తే విడాకులు తీసుకున్నట్లే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ మొన్నటికి మొన్న నిహారిక కూడా ఇలాగే తన భర్త విషయంలో కూడా చేసింది. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలామంది నెటిజెన్స్ వీరిద్దరూ విడిపోతున్నారని భావిస్తున్నారు. మరి నిజంగానే మౌనిక రెడ్డి విడాకులు తీసుకుంటుందా లేదా అనేది క్లారిటీగా తెలియటం లేదు.. కాబట్టి ఆమె ఈ వార్తలకు ఒక క్లారిటీ ఇవ్వాలని చాలామంది నెటిజెన్స్ వెయిట్ చేస్తున్నారు.