బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అయినా గురించి అంకిత లోఖండే మనందరికీ తెలిసిందే. ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైలో తన ప్రియుడైన విక్కీ జైన్ ను వివాహం చేసుకోనుంది. తాజాగా విక్కీ తన ఇంస్టాగ్రామ్ లో వారిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకకు ఫోటోలను షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటోలలో అంకిత పింక్ అండ్ గోల్డెన్ బార్డర్ తో గ్రీన్ సారీ కట్టుకొని సంప్రదాయ పద్ధతిలో ఆభరణాలు ధరించింది.విక్కీ కూడా ఆఫ్ వైట్ కుర్తా ధరించాడు.
అంకిత కూడా అని క్యాన్సల్ ఇస్తూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన పలువురు ప్రముఖులు కామెంట్ బాక్స్ లో హార్ట్ ఎమోజిస్ తో శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవలే ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకను సన్నిహితుల మధ్య జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననాయి. కొద్దిరోజుల క్రితం ఈ జంట వారి వెడ్డింగ్ కార్డ్స్ ను పంచినట్టు సమాచారం. ఈ జంట డిసెంబర్12,13,14 తేదీలలో వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి.