తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్రేజ్ గురించి కూడా అందరికీ తెలిసిందే ఎటువంటి సపోర్టు లేకుండా కేవలం సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించి అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించిన అంజలి ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది.
ఈ సమయంలోనే టాలీవుడ్ లో కూడా అంజలి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అంజలి, రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తోంది . తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అంజలి తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అంజలి వివాహం గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలోని ఇప్పటివరకు నేను ఎంతోమందితో రిలేషన్స్ లో ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది అంజలి. ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలని ఆ తర్వాతే ప్రేమ అభిమానం మిగతావి ఏవైనా అని తెలియజేసింది రెస్పెక్ట్ లేని చోట ఏది ఉన్న వేస్ట్ అంటూ తెలియజేసింది అంజలి.ఇలాంటి క్వాలిటీ ఉన్న ఎవరైనా నాకు ఓకే అంటూ తెలియజేసింది. స్టేటస్ ను పెద్దగా పట్టించుకోనంటూ కూడా తెలియజేసింది. తన వృత్తికి గౌరవాన్ని ఇచ్చే వాడిని వివాహం చేసుకుంటానంటూ తెలిపింది.
తాజాగా అంజలి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంజలి పలు చిత్రాలలో హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తూ ఉంటోంది. ప్రస్తుతం అంజలి చేసిన ఈ కామెంట్లు సైతం వైరల్ గా మారుతున్నాయి.