టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య ఫ్యామిలీకి కానీ బాలయ్యకు కానీ ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయనకు ఆడవారు అంటే ఎనలేని గౌరవం ఇస్తారు. బాలయ్య సినిమా షూటింగ్ టైంలో ఏ హీరోయిన్ కూడా ఇబ్బంది పడకుండా వారికి తగిన సౌకర్యాలు కూడా కలిగిస్తారు. ఇక బాలయ్య వ్యక్తిత్వం చాలా మంచిదని తనతో పని చేసిన వారందరూ అంటూ ఉంటారు. ఒక్కసారి బాలయ్య తన అనుకుంటే ఏం చేయటానికైనా రెడీ అయిపోతాడు. అంటూ పలువురు సెలబ్రిటీలు బాలయ్య గురించి మాట్లాడిన కామెంట్స్ మనం విన్నాం
అయితే తాజాగా తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనిత చౌదరి కూడ ఒకరు. అప్పట్లో పలు సినిమాలలో నటించి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా అనిత చౌదరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. తను రెండుసార్లు ప్రమాదానికి గురైందని అయితే దేవుని దయవల్ల ఎట్టకేలకు ప్రమాదం నుంచి బయటపడ్డాను అంతేకాకుండా ఇలా బయటపడ్డానికి కూడా నందమూరి బాలయ్య ఒక కారణం అనిత చౌదరి చెప్పుకొచ్చింది.
తను ఒకరోజు అమెరికాకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో తన కాలర్ బోన్ విరగడం మళ్లీ సెట్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ రెండోసారి కూడా ప్రమాదానికి గురయ్యానని అనిత చౌదరి తెలిపింది. కేరింత సినిమా సమయంలో తనకు రెండో ప్రమాదం జరిగిందని ఆ టైంలో డిస్క్ విరిగిందని ఆ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతుండగా ఆ టైంలో నా అభిమాని బాలయ్యకు మంచి ఫ్రెండ్ కావటంతో ఆమె బాలయ్యకు వివరించింది. అప్పుడు బాలయ్య నా ట్రీట్మెంట్ ని అక్కడున్న డాక్టర్లతో చేయించి అమెరికాలో ఉన్న నా భర్తకు ధైర్యం చెప్పాడట. అనిత చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.