తెలుగు హీరోయిన్లలో అను ఇమ్మన్యూయేల్ కూడా ఒకరు..ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. మొట్టమొదటిగా మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. అందులో నాని హీరోగా నటించాడు. ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా మంచి మార్పులే కొట్టేసింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించిన ఈ అమ్మడికి తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత కాస్త ఇమేజ్ను ఫాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
నా పేరు సూర్య, అజ్ఞాతవాసి ఇలా ఒక సినిమా తర్వాత మరో సినిమా చాన్సులు వస్తూ అగ్ర హీరోల సరసన నటించింది.. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకోలేకపోయింది. అలాగే కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో రియంట్రి ఇచ్చింది. తాజాగా ఈమె కార్తీక్ తో జపాన్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానంది..ఈ సినిమాపై ఈ అమ్మడు చాలా ఆశలను పెట్టుకుందనే చెప్పవచ్చు.
కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సర్దుకుపోవాలి అనే అంశంపై స్పందిస్తూ అను ఇమ్మానియేల్ తనకు కూడా క్యాస్టింగ్ కోచ్ ఎదురయ్యాయని చెప్పింది. ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఎదుర్కొంటూనే ఉన్నారు …ఎదురుకున్నా కూడా అలాంటి సందర్భంలో కుటుంబం తో ఇలాంటి సమస్యలను అధిగమించాలని తెలియజేసింది అను ఇమ్మానుయేల్ ..
మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు అండగా ఉండటం చాలా ముఖ్యమని ఏదైనా సమస్య వస్తే కుటుంబంతో సహా మనం ఎదుర్కొంటే ఆ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.. ఈమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా గతంలో హీరో పైన రూమర్లు రావడంతో క్లారిటీ ఇచ్చింది తనకు ఆ హీరోతో ఎలాంటి సంబంధం లేదని కేవలం సినిమాలో క్లోజప్ గా కనిపించేందుకు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యామని తెలిపింది.. అంతేకాకుండా ఆ కుటుంబంలో నుంచి గతంలో ఒక హీరోతో సినిమా చేశానని తెలిపింది.