ఆందోళనకరంగా మారిన కమల్ హసన్ ఆరోగ్యం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కరొనా మహమ్మారి ఉద్రిక్తత నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. నిన్నటి రోజున సినీ నటుడు కమల్ హాసన్ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మాతృభాష తమిళంలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలియజేశారు.

తాను వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ పై చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేరారు. జ్వరంతో పాటు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో కమల్ హాసన్ తన ఆసుపత్రికి చికిత్స కోసం రాగా అక్కడ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చినట్లు ఆస్పత్రి డైరెక్టర్ సుహాన్ ప్రభాకర్ తెలిపారు.

కమలహాసన్ అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గుతో బాధపడుతున్నారట. ఇక ఆయనకి కరోనా సోకింది అనే విషయం తెలియడంతో తమిళ సినీ ప్రముఖులు హుటాహుటిగా ఆస్పత్రికి చేరుకున్నారు. కానీ కమల్ హాసన్ వారితో మాట్లాడేందుకు నిరాకరించారట. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నందున తాను ఎవరినీ కలుసుకోవాలను కోలేదంటూ కమలహాసన్ వారికి ఫోన్ లో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది అనధికారికంగా తన స్నేహితులకు తెలిపినట్లు సమాచారం. కాగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ స్పష్టం చేసింది.

Share.